కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ నడక సాగిస్తున్నారు రాహుల్. ఈ సందర్భంగా అటు మోదీపైనా, ఇటు కేసీఆర్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు రాహుల్ . అన్ని వ్యవస్థలను మోదీ నాశనం చేశారని తాము అధికారంలోకి వస్తే సమూల మార్పులకు శ్రీకారం చేస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాలనుంచి దేశాన్ని కాపాడుతామన్నారు. ఇక తెలంగాణ టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తూ ఉండబోదన్నారు రాహుల్. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని అన్నారు.