రాహుల్ జీ.. వాట్ ఏ లుక్.. న్యూ డ్రెస్ అదుర్స్..!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. వయనాడ్ ఎంపీ కూడా. ఆయన ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. ఈ ప్రత్యక్షంగా మీడియా ముందుకు రాకున్నప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తూ.. అధికార బీజేపీకి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇక ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్తే.. రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కుర్తా పైజామా ధరిస్తూ కనిపిస్తారు. ఇక బయట వెళ్లినప్పుడు టీ షర్ట్,జీన్స్ వేసుకుని దర్శనమిస్తారు. అయితే ప్రస్తుతం ఆయన కొత్త లుక్‌లో పార్లమెంట్లో దర్శనమిచ్చారు. షర్ట్ వేసుకుని ఇన్‌షర్ట్ వేసుకుని పార్లమెంట్లో కన్పించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. న్యూ గెటప్‌ను చూసిన కాంగ్రెస్ అభిమానులు రాహుల్ ఎంతో స్మార్ట్‌గా ఉన్నాడంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యూలుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.