బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీకి ఆయన హితవు పలికారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజల్ని వేధిస్తున్నాయన్న ఆయన… అలాంటి సమస్యలపై ప్రభుత్వం బుల్డోజర్ నడిపితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మధ్య ప్రదేశ్లోని ఖర్గోన్లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. శోభాయాత్రపై దుండగుల రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి.ఏడుగురు పోలీసులూ గాయపడ్డారు. ఇళ్లు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఆరోజు ఆందోళనల్లో ధ్వంసమైన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆ రోజేపలువురి నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుల్డోజర్ పదం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. అక్రమ నిర్మాణాలను యోగీ సర్కారు బుల్డోజర్లతో ధ్వంసం చేయించింది. బుల్డోజర్ బాబా వస్తే అమాయకుల మీదకు బుల్డోజర్ తోలిస్తాడని విపక్షాలు ప్రచారం చేస్తే అక్రమార్కుల మీదకు బుల్డోజర్లు పంపుతారని బీజేపీ ప్రచారం చేసింది. రెండోసారి అధికారంలోకి రాగానే అన్నంత పన్నీ చేస్తున్నారు యోగీ. ఇక మధ్యప్రదేశ్ సైతం బుల్డోజర్ల వాడకాన్ని ఉధృతం చేసింది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.
महंगाई और बेरोज़गारी ने देश की जनता का दम निकाल दिया है।
सरकार को लोगों की इन समस्याओं पर bulldozer चलाना चाहिए।
मगर भाजपा के bulldozer पर तो नफ़रत और दहशत सवार है।
— Rahul Gandhi (@RahulGandhi) April 12, 2022