కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో ఇరుక్కొని పోయారు. కాంగ్రెస్ అధిష్టానం నమ్మిన బంటు గా పేరు తెచ్చుకొన్న మన్మోహన్ సింగ్ మృతికి దేశ వ్యాప్తంగా సంతాప దినాలు పాటిస్తున్నాయి. ఏడు రోజుల పాటు సంతాప దినాలు కాబట్టి ఎటువంటి ఉత్సవాలు, వేడుకలు వద్దని నిర్ణయించుకొన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం కూడా ముందుకు వచ్చి, ఈ విషాదాన్ని పంచుకొంటోంది.
ఈ సమయంలో రాహుల్ గాంధీ మాత్రం తన షెడ్యూల్ ను కొనసాగిస్తున్నారు. వియత్నాం లో ముందుగా బుక్ చేసుకొన్న నూతన సంవత్సర వేడుకలకు హాజరు అయ్యేందుకు ప్రయాణం పెట్టుకొన్నారు. విదేశీయుల న్యూ ఇయర్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు బయలు దేరిపోయారు. దీని మీద బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దేశమంతా విషాదంలో ఉంటే, రాహుల్ గాంధీకి మాత్రం తన ఎంజాయ్ మెంటే తనకు ముఖ్యం అని సూటిగా విమర్శించింది.
గతంలో కూడా ముంబై లో ఉగ్రవాదులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అప్పట్లో దేశమంతా షాక్ లో మునిగిపోయింది. అప్పుడు కూడా తన ఫ్రెండ్ సమీర్ శర్మ ఇంట్లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకొన్నారు. ఈ విషయంలో అప్పట్లో కలకలం రేపింది. దానిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అంత్యక్రియల నుంచి నేరుగా ఇంటికి వెళ్లి బట్టలు సర్దుకొని పార్టీకి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శల్ని తప్పు పడుతోంది. రాహుల్ గాంధీ ప్రైవేటు లైఫ్ గురించి ప్రశ్నించే హక్కు బీజేపీ కి లేదని మండిపడుతోంది.