నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. గురవారం విచారణకు హాజరుకాకపోవడంతో జూన్ 13న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపింది. విదేశంలో ఉన్నందున రావడం కుదరదని మరింత సమయంలో కావాలని రాహుల్ ఈడీని కోరారు. గురువారం విచారణకు రావడం లేదని సమాచారం పంపారు.
రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రమణ్యస్వామి ఆరోపించడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇక ఇదే కేసులో జూన్ 8న విచారణకు హాజరుకావాల్సిన సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద గాంధీలిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనుంది ఈడీ