తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు కాంగ్రెస్ సుప్రీం నాయకుడు రాహుల్ గాంధీ వెనుకంజ వేస్తున్నారు. మరోసారి రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాహుల్ గాంధీ వస్తున్నారు అని రుణమాఫీ కి సంబంధించిన పత్రాలు ఆయన చేతుల మీదుగా అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పుకొని వచ్చారు మీద కానీ అనేక చోట్ల రుణమాఫీ మీద రైతుల నుంచి నిరసనలు నిలబడుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న రాహుల్ గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. ఒకవైపు రుణమాఫీ మీద ఆందోళనలు మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహం మీద గడబిడ నెలకొనడంతో రాహుల్ గాంధీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
రుణమాఫీ చేయడానికి తలపెట్టిన వరంగల్ కృతజ్ఞత సభలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉంది. కానీ ఏ రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని.. రైతులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి శవ యాత్రలు చేస్తున్నారన్న వార్తలు హై కమాండ్ వరకు చేరాయి. దీంతో మరో 3 రోజుల్లో జరగవలసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్లు సమాచారం. మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసినపుడు జూలై నెలలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో కృతజ్ఞత సభ పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు . కానీ తరువాత ఆగస్ట్ 15 అన్నారు ,, చివరికి ఆగస్ట్ 24 అన్నారు. దీని కోసం ఆహ్వానించేందుకు 2 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి సోనియా, రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
అంతమాత్రాన రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఐ కమాండ్ కోపంగా మాత్రం లేదని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బిఆర్ఎస్ పార్టీతో కొట్లాట రీత్యా ఈ సమస్యలు తలెత్తాయని హైకమాండ్ భావిస్తోంది. అందుచేత కృతజ్ఞత సభను రాష్ట్ర నాయకులు తోటే నడిపించాలని హైకమాండ్ సూచించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.