రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దిబ్రూగఢ్‌లో పాల్గొన్నారు. ఓ కాలేజీ విద్యార్ధులతో సంభాషిస్తూ పరోక్షంగా ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు. నాగ్‌పూర్‌లో ఒకేఒక్క శక్తి యావత్ దేశాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో బీజేపీ విద్వేశాన్ని పెంచుతూ.. విభజించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.