పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత స్వభావంతో పరిపాలిస్తోందని, దీనివల్ల భారత దేశ ప్రజలు, సంస్కృతులు, భాషలు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్వభావానికి ప్రమాదం పొంచి ఉందని రాహుల్ అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశం ఓ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, కానీ బీజేపీ ఈ దేశాన్ని బెత్తంతో పరిపాలించాలని కోరుకుంటోందని ఆరోపించారు. రాహుల్ ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుడొకరు సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించారు. రాహుల్ కనీసం రాజ్యాంగ ప్రవేశికనైనా చదవలేదని… భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని సత్యనిష్ఠతో దృఢంగా నిర్ణయించుకున్నాం’’ అని రాజ్యాంగ ప్రవేశికలో ఉందని తన నోటీసులో పేర్కొన్నారు.