బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గురించి పరిచయం అక్కర లేదు. మన మెహదీపట్నంలో ఆమె చిన్నప్పుడు చదువుకొన్నారు. మన తెలంగాణ సంస్క్రతి అంటే ఆమెకు బాగా ఇష్టం. క్రమం తప్పకుండా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. బ్యాడ్మింటన్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండటం ఆమెకు అలవాటు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ఆమె సంప్రదాయాలు మరిచిపోలేదు. హైదరాబాదీ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జంట ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టులో పెళ్లాడారు. ఆ పెళ్లి విశేషాలు, ఉదయ్ పూర్ రిసార్ట్ విశేషాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పీవీ సింధు కుటుంబం సాంప్రదాయ బద్దంగా ఉంటారు. హైందవ సాంస్క్రతి సాంప్రదాయాలను బాగా గౌరవిస్తూ ఉంటారు. అలాగే సింధు పెళ్లి విషయంలో కూడా చక్కగా సాంప్రదాయ పద్దతిలోనే చేసుకొన్నారు. ఉదయ్ పూర్ రిసార్ట్ లో చాలా వైభవంగా పెళ్లి జరిగింది. దీంతో ఈ రిసార్ట్ మీద అందరికీ ఆసక్తి నెలకొంది. నిజానికి 21 ఎకరాలు ఉన్న ఆ ప్యాలెస్ .. ఫ్రెంచ్ ఆల్ట్రా లగ్జరీ బ్రాండ్ గా నిలుస్తోంది. దీని యాజమాని పేరు… రఫేల్స్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అని చెబుతున్నారు. . సింగపూర్‌కు చెందిన రఫేల్స్ హోటల్ కూడా ఆ వేదికలోనే ఉన్నట్లు తెలిసింది. ఉదయ్ సాగర్ చెరువు మధ్యలో ఆ హోటల్ ఉంది. అరావలీ పర్వత అందాలు అక్కడ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తుంటాయి. రిసార్టులోని వృక్షాలు,జంతువులు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
ఈ రిసార్ట్ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రాంగణంలో చాలా లగ్జరీ రూమ్‌లు, సూట్లు ఉన్నాయి. డైనింగ్, స్పా, రఫేల్స్ లాంగ్ బార్, రైటర్స్ బార్ ఉన్నాయి. కో అంటే కోటి రకాల సౌకర్యాలు అక్కడకు తెచ్చి పెట్టేస్తారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని మాజీ భార్య నటాషా స్టాన్కోవిక్.. గత ఏడాది ఈ హోటల్లోనే తమ వెడ్డింగ్ స్మృతులను గుర్తు చేసుకున్నారు. అనేక మంది కోటీశ్వరుల పెళ్లిళ్లు ఇక్కడ జరిగాయి అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీవీ సింధు పెళ్లికి ఈ వేదికను సెలక్ట్ చేసుకొన్నట్లు తెలుస్తోంది.
ఉదయ్ పూర్ లోని ఈ రిసార్ట్ చాలా విలాసవంతమైనది మరియు ఖరీదైనది. ఈ ఖరీదైన హోటల్లో ఒక రాత్రి అకామిడేషన్ సుమారు లక్ష వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్ పూల్స్, ఆర్ట్‌వర్క్స్, లాన్లు.. ఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. యురోప్కు చెందిన పల్లాడియన్ ఆర్కిటెక్చర్ స్టయిల్లో ఆ హోటల్ ప్రాపర్టీని డెకరేట్ చేశారు. రాజ్‌పుత్-మొఘల్ ప్రావీణ్యం కూడా ఆ హోటల్ అందాల్లో కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ లో అద్భుతం అన్నది అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
మొత్తం మీద పీవీ సింధు .. వెంకట దత్త సాయి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అనటంలో సందేహం ఏమాత్రం లేదు. సోషల్ మీడియాలో ఇయర్ ఎండ్ లో ఇది మరింత సందడి సృష్టించింది. అంతే కాదు సెర్చింగ్ లో కూడా ఈ టాపిక్ బాగా ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇన్ స్టా, షేర్ చాట్ వంటి యూత్ ప్లాట్ ఫామ్ లలో అయితే టాప్ లిస్ట్ లో నిలుస్తోంది. మొత్తం మీద సంవత్సరం చివరలో పీవీ సింధు మరోసారి హల్ చల్ చేసింది అనుకోవచ్చు.