రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ పై యుద్ధం చేసేవారు కాదన్నారు. ఉక్రెయిన్ పై మగతనపు సహజ లక్షణం అయిన దూకుడును పుతిన్ ప్రదర్శించారన్నారు.
బాలికలు, మహిళల పురోభివృద్ధి గురించి మాట్లాడే సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు బోరిస్. ప్రపంచవ్యాప్తంగా బాలికలకు మెరుగైన విద్య అందించాలని…మహిళలు అన్నిరంగాల్లో ఉన్నతస్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు.
మగజాతి లక్షణాల గురించిచెబుతూ దూకుడు ఉండకూడదన్నారు. అదే సమయంలో పుతిన్ కనుక మహిళ అయి ఉంటే యుద్ధానికి తెగపడేవాడు కాదనీ అన్నారు.ఇప్పటికైనా శాంతి ఒప్పందం కోసం పుతిన్ ముందుకు రావలన్నారు బోరిస్. రష్యాతో శాంతి చర్చలు సఫలమైతే…ఉక్రెయిన్ సాధారణ స్థితికి రావడానికి పాశ్చాత్యదేశాలు మద్దతుగా ఉండాలని..ఉంటాయనీ అన్నారు బ్రిటన్ ప్రధాని.