అకాలమరణంతో అభిమానులకు గుండెకోత మిగిల్చిన కన్నడసూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠశాల సిలబస్లో పాఠ్యాంశంగా పెట్టాలని కర్నాటక ప్రభుత్వం విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు తాజాగా భారతినగర్ రెసిడెంట్స్ ఫోరం సీఎం బొమ్మైకి విజ్ఞప్తిచేసింది. నటనతో అభిమానులను ఆకట్టుకోవడమే కాక… వందలాది మంది నిరుపేద విద్యార్ధులను, అనాథలను సొంత డబ్బుతో చదివించి, బతుకునిచ్చారని గుర్తు చేస్తున్నారు స్థానికులు . పునీత్ జీవిత చరిత్ర ద్వారా విద్యార్ధులు స్ఫూర్తి పొందుతారని చెబుతున్నారు.