ఇవాళే పూరీ జగన్నాథయాత్ర:
భక్తులను రక్షించడానికి
దుష్టులును శిక్షించడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
మనలో అహం పారద్రోలాడానికి
ప్రేమాభిమానాలు పెంచడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
ఈర్ష్య, అసూయ పొగట్టడనికి
భక్తి భావన పెంచడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
మనలో మంచితనం పెంచడానికి
విష భావాలు తొలిగించడానికి
వస్తున్నాయ్ వస్తున్నాయి
జగన్నాథ రథ చక్రాలు!!
ప్రతి సంవత్సరం అలా సాగె పూరియాత్ర జీవితంలో ఒకసారి అయిన చూడాలి..జగన్నాథ రథ చక్రాలు లాగలి..మనలో పెరుకొని పోయిన అసహనం,ఈర్ష్య, దుఃఖం,భయంపోగొట్టుకోవాలి..ప్రేమ,సహనం,భక్తి,సహాయ గుణాలు పెంచుకోవాలి…అలా మనను చేయగలిగే వాడే జగన్నాథుడు!!
భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం,విశిష్టత,అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాల్సిన క్షేత్రం.అలంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.
ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది.ప్రపంచ ప్రసిద్ధిచెందింది.ఈ ఆలయాన్ని 1078సంలో పూరీలో నిర్మించారు.
ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు, స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి.అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ.ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి.
గోపురం
ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.
రెపరెపలాడే జెండా
ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది.అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.
పూరీ జగన్నాధుడి రధయాత్ర
ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది.ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి.రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.
పూరీ వీధుల్లో శ్రీకృష్ణ, బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు.రధం సుమారు 45అడుగుల ఎత్తు, 35అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.
మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది.ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి.అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.
ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది.ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురంవైపున్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.
సైన్స్ కి అంతుపట్టని రహస్యాలు
సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది.సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది.కానీ పూరీలో అంతా విభిన్నం.సముద్ర అలల శబ్దం ఇంకొక అద్భుతం . దేవుడి గుడి సింహ ద్వారం గుండా ఆలయం లోకి ప్రవేశిస్తూ ఒక్క అడుగు లోపలకి పెట్టగానే సముద్రపు అలలు అస్సలు వినిపించవు ..కానీ ఎప్పుడైతే గుడి బయటకి అడుగు పెడతామో వెంటనే చాలా క్లియర్ గా సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది ..అయితే సాయంత్రం అయితే ఈ శబ్దాన్ని గమనించలేరు ..కారణం ఇద్దరి దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కోరటం వలన ఇలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తారు ..
మహా ప్రసాదం
ఇక జగన్నాధ్ ఆలయం లో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని “మహా ప్రసాదం ” గా పిలుస్తారు దాదాపు రోజుకి 56 రకాల పిండివంటలని …దేవుడి కి నైవేద్యం గా పెడతారు ఈ ప్రసాదాన్ని ఎవరు కూడా వృధా చెయ్యరు ….ఇంకా ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్లి తమ బందు మిత్రులకి పంచి పెడతారు కూడా…
సహజసిద్ధమైన తయారీ
ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ ప్రసాదాల్ని కేవలం కుండలలో నే తయారు చేయడం …ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ మారె ఇతర లోహ పాత్రలని ఉపయోగించక పోవడం.
కృష్ణుడిని, బలరాముడిని అంతమొందించడానికి, కృష్ణుడి మామ అయిన కంసుడు వారిద్ధరిని మథురకి ఆహ్వానిస్తాడు.అందుకుఅకురుడికిరధాన్ని ఇచ్చి కృష్ణ-బలరాములను మధురకు కంసుడుతీసుకునిరమ్మంటాడు.శ్రీ కృష్ణ పరమాత్ముడు, బలరాముడు గోకులం నుంచి మథురాకి రధము పై బయలుదేరిన రోజుని పురస్కరించుకుని, జగన్నాథ రథ యాత్రను వేల సంవత్సరాలుగాజరుపుకుంటూ వస్తున్నారు.
పూరి లో వైభవంగా సాగే జగన్నాథ రథ యాత్రలో పాలుపంచుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏట జరిగే ఈ రథ యాత్రరెండురోజుల పండుగగా ఉంటుంది. మొదటి రోజున, జగన్నాథస్వామివారిని, వారికుటుంబ సమేతంగా, జగన్నాథ స్వామి అలయంనుంచి మొదటిరధం లో అంగరంగ వైభవంగా నది వరకు తిసుకువేళతారు.అక్కడనుంచిప్రతిమలనుఒక పడవలో నది దాటించి,నదికి ఆవల ఉన్న మౌసి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువెళ్తారు. మరుసటిరోజు, మౌసి అమ్మవారి ఆలయం నుంచి ఆ ప్రతిమలను నదికివద్దకు తీసుకువచ్చి,ఒక పడవపై వాటినిఇటు వైపు ఒడ్డుకి తరలిస్తారు. అక్కడేసిద్ధంగాఉండేరెండో రధం పై ఊరేగిస్తూ మేళ తాళల, భక్తుల కేరింతల మధ్య మరల జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు.
ఈ రోజు జ్యేష్ఠ పూర్ణిమ.
ఒరిస్సాలోనున్న పూరీ క్షేత్రంలో ఈ రోజు చాల వైభవంగా స్నానోత్సవం జరుగుతుంది.జ్యేష్ఠ పూర్ణిమనాడు ఉదయం జగన్నాథ , బలభద్ర , సుభద్ర , సుదర్శన మరియు మదనమోహన విగ్రహాలను (మూల విరాట్టులను) రత్నవేది (నిత్యం వారు కొలువుదీరి ఉండే మండపం) నుండి స్నాన వేదికకు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు.అక్కడ గల సువర్ణబావి నుండి 108 కళశాలతో జలాలను తెచ్చి వాటిలో పసుపు , చందనం , పువ్వులు , సుగంధ ద్రవ్యాలు కలిపి వేదమంత్రాలు , శంఖనాదాలు , కీర్తనల నడుమ అభిషేకం చేస్తారు.ఈ స్నాన వేదిక 76 అడుగుల వెడల్పు ఉంటుంది.వచ్చిన వారికి కనిపించే విధంగా ఎత్తులో పెట్టి ఈ అభిషేకం నిర్వహిస్తారు.ఆగమ శాస్త్రం ప్రకారం సంవత్సరం పొడవునా జరిగే /జరగనున్న వివిధ ఉత్సవాలలో తెలిసీ తెలియక ఏమైనా లోపాలు జరిగిఉంటే అవి ఈ స్నానోత్సవం వల్ల పరిహారమౌతాయి.ధర్మశాస్త్రం ప్రకారం ఇది చూసిన వారి పాపాలన్నీ కడుగుకుపోతాయి.ఈ ఉత్సవం జరిగిన సాయంత్రం జగన్నాథునికి , బలభద్రునికి గణేశుని అవతారంతో అలంకరిస్తారు.దీనితో ఒక భక్తుని గాథ ముడిపడిఉంది.మహారాష్ట్రకు చెందిన గణపతిభట్టు మహా గణపతి భక్తుడు.తను జగన్నాథుని ద్వారా కూడా గణపతి అనుగ్రహం కోరుకున్నాడు.ఆయన పూరీ చేరేసరికి అప్పుడే భోగసమయం కావడం వల్ల గుడి తలుపులు మూసివేయబడ్డాయి.అప్పుడు ఈయనకి ఒక దృశ్యం కనిపించింది.జగన్నాథ బలభద్రులు మరియు అక్కడ ఉన్న పరివార దేవతలకందరకు శ్రీ సుభద్రా దేవి భోజనం వడ్డన చేస్తోంది.అదే సమయంలో సకల దేవతా రూపుడైన జగన్నాథుడు వినాయకునిగా రూపాంతరం చెంది ఈ భక్తుని తన తొండంతో లోపలకు తీసుకుని తనలో ఐక్యం చేసుకున్నాడుఇది జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరిగింది.దానిని పురస్కరించుకునే ఈ గణేశ అవతారం.
ఎలా వెళ్ళాలి
1. ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం వుంది.
2. భువనేశ్వర్‌లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో వుంది.
3. దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
4. కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్ రైల్వేస్టేషన్ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో వుంది.
5. భువనేశ్వర్, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది .
– గిరీశ్