అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయిన పంజాబ్ తాజామాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలుండడంతో కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. కేసు నమోదు చేయాలని వెంటనే పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సింగ్లాను అరెస్ట్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో మన్సా నుంచి గెలిచారు విజయ్ సింగ్లా. ఆయన్ని కేబినెట్లో తీసుకుని కీలకమైన ఆరోగ్య శాఖను అప్పగించారు. అయితే వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పరికరాల కొనుకోలు టెండర్లలో కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు, ఆ తరువాత ఆధారాలు బయటకొచ్చాయి.