దేశంలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే యూపీలో మొదటి సారి లవ్ జిహాద్ నిందితుడికి శిక్షపడింది. అసలు పేరు దాచిపెట్టి ప్రేమపేరుతో యువతిని మోసం చేసిన జావేద్ అలియాస్ మున్నాకు 10 ఏళ్ల జైలుశిక్ష, 30వేల రూపాయల జరిమానా విధించింది కాన్పూర్ జిల్లా కోర్టు. బాధితురాలికి 20 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నివేదిక ప్రకారం, లవ్ జిహాద్లో ఇది మొదటి శిక్షగా డిజిసి క్రైమ్ దిలీప్ కుమార్ తెలిపారు.
నిందితుడు తన అసలు పేరు, మతం వివరాలు దాచిపెట్టి ప్రేమ పేరుతో నమ్మంచి అత్యాచారానికి పాల్పడ్డట్టు నిర్ధారణ అయింది.
2017లో కాన్పూర్ లోని జుహీ పరిధిలోని మైనర్ బాలికను ప్రేమిస్తానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు . తన పేరు మున్నానని హిందువునని చెప్పాడు. దీంతో బాలిక అతనితో స్నేహం చేసింది. ప్రేమించింది. ఓరోజు తనతో తీసుకెళ్లిపోయాడు. తరువాత అతను హిందువు కాదు ముస్లిం అని అమ్మాయికి తెలిసింది. అంతేకాదు మతం మారాలని ఒత్తిడి చేశాడు. అత్యాచారం చేయబోయాడు. దీంతో యువతి తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, అత్యాచారం నేరాల కింద కేసు నమోదు చేశారు.