ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో తన వాల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్ సైట్లో భారతీయ వారసత్వ ప్రదేశాల వివరాల్ని హిందీలో ప్రచురించింది. అందుకు హర్షం వ్యక్తం చేసిన యునెస్కో శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ….ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ సందర్భంగా యునెస్కో వర్చువల్ వేడుకల్నీ నిర్వహించిందన్నారు.
అటు హిందీ దినోత్సవం సందర్భంగా విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి మీనాక్షీ లేఖి వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. హిందీ భాష ప్రాముఖ్యతను తెలియచేస్తూ అందుకే ఈ దేశపు మాతృభాష అయిందన్నారు. ఇక యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి శర్మ కూడా స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో భాషపరంగా సాధించిన కీలక విజయాలను హైలైట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. వరల్డ్ హిందీ డే సందర్భంగా దాదాపు అన్ని ప్రపంచ దేశాలు, హైకమీషన్, రాయబార కార్యాలయాలు భారత్ కు శుభాకాంక్షలు తెలిపాయి.