ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తూ ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీసులపై దాడి చేసి పోలీసు వాహనాలను తగులబెట్టారు.
డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ చీఫ్ రాస్మస్ పలుడాన్ ముస్లింలు అధికంగా ఉండే లింకోపింగ్ పరిసరాల్లో ఖురాన్ కాపీని కాల్చివేస్తామని ప్రకటించారు. 200 మంది ముస్లింలతో కూడిన పెద్ద గుంపు నిరసనగా గుమిగూడగా, స్ట్రామ్ కుర్స్ చీఫ్ ముందుకు వెళ్లి పుస్తకాన్ని తగులబెట్టారు.
ఇండిపెండెంట్ రీసర్చర్ హ్యూగో కామన్ తెలిపిన వివరాల ప్రకారం, దాడిలో మొత్తం నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు చివరికి ఆ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గారు. తద్వారా ఇతర స్వీడిష్ నగరాలైన నోర్కోపింగ్, రింకేబీ, స్టాక్‌హోమ్ సహా ఒరెబ్రోలలో హింసాకాండను కొనసాగించమని అల్లరిమూకలను ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. అక్కడ పరిస్థితి బాగాలేదు.సంఘటనా స్థలంలో పోలీసులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయి” అని పోలీసు ప్రతినిధి ఆసా విల్సుండ్ వ్యాఖ్యానించారు.
Riots broke out in Linköping, Sweden yesterday following a scheduled quran burning by a Danish far-right politician. Police cars were looted & burned, 4 police were injured & police even withdrew from the area. Riots have spread to Norrköping & Rinkeby, Stockholm as well pic.twitter.com/2cco5MKwxS
— Hugo Kaaman (@HKaaman) April 15, 2022
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 15న స్వీడిష్ నగరమైన ఒరెబ్రోలో అల్లర్లు చెలరేగాయి, ఈ సమయంలో ఆ మూక పోలీసులపై దాడికి పాల్పడింది. రాళ్లు విసిరారు, 4 వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో కనీసం నలుగురు పోలీసులు, ఒక ప్రైవేట్ వ్యక్తి గాయపడ్డారని రాయిటర్స్ నివేదించింది. హ్యూగో కామన్ ప్రకారం, అల్లరిమూకలు పోలీసు వాహనాన్ని కూడా దొంగిలించి ఆ కారులో నగరంలో తిరుగుతున్నారు.
హింసాకాండపై స్వీడిష్ ప్రధాన మంత్రి మాగ్డలీనా ఆండర్సన్ స్పందిస్తూ.. ఒరెబ్రోలో పోలీసులు, సాధారణ ప్రజలపై ఇప్పుడు జరుగుతున్న హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ సేవలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు, దీనిపై చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)