కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు గత నెల 27న దారుణ హత్యకు గురయ్యాడు. తన షాప్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ప్రవీణ్‌ను బైక్‌పై వెంటాడి మరీ నరికి చంపారు.