వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా దీక్షలో కూర్చోవడమే కారణం. ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు రవీంద్ర కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అంతకుముందే అక్కడ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బోడుప్పల్లో సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ఆమె అనడంతో… పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీక్షకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని ప్రశ్నించేందుకు ఆమె మేడిపల్లి పీఎస్ కు వెళ్లారు. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తం నెలకొంది. పార్టీ కార్యకర్తలు రోడ్డుమీదే భైఠాయించారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.