హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన దుమారం రేపుతోంది. థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి చేయబోగా ఆమె తప్పించుకుంది. విద్యార్థిని ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యార్థిలోకం భగ్గుమన్నారు. ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విద్యార్థులు క్యాంపస్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తం నెలకొంది. యాజమాన్యం ప్రొఫెసర్ పై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
Telangana | Cyberabad Police have taken a professor of University of Hyderabad into custody after a student alleged that he molested her. The student belongs to Thailand & is studying here: K Shilpavalli, DCP Madhapur
— ANI (@ANI) December 3, 2022