హిందీలో విడుదలై సంచలనం రేపుతున్న ది కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శలు, వివాదాలూ చుట్టుముడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లో ఉద్రిక్తం నెలకొంది. సినిమా చూస్తూ కొందరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. వెంటనే ప్రేక్షకులు వారిని చుట్టుముట్టారు. అయితే ఆ ఇద్దరూ తప్పించుకుని పారిపోయారు. స్థానిక నటరాజ్ థియేటర్లో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికే దుండగులు పారిపోయారు. అక్కడున్న వారిచ్చిన వివరాలతో కేసు నమోదు చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)