కేరళ ఓటర్లు కాంగ్రెస్ మీద అభిమానం చాటుకున్నారు. మహారాష్ట్ర ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు కొన్ని పార్లమెంటు స్థానాలకి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ప్రియాంక వాద్ర హవా కొనసాగుతోంది. సమీప ప్రత్యర్థి కంటే వేల సంఖ్యలో ఓట్ల మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక అవసరమైంది.