పార్లమెంట్ లో అడ్డంగా బుక్ అయిన ప్రియాంక…
కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రియాంక గాంధీ మీద వరుస పెట్టి ట్రోలింగ్ నడుస్తోంది. పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా రోడ్డు మీదకు లాగేసి ప్రియాంకతో పాటుగా ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఈ విషయంలో సర్దుకునేందుకు కాంగ్రెస్ అభిమానులు కింద మీద పడుతున్నారు. మొత్తం మీద పార్లమెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలన్న ప్రియాంక గాంధీ ఆలోచన మరో రూట్లో నెరవేరింది అనుకోవాలి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాయనాడ్ నుంచి లోక్ సభ కు ఎన్నికైన ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మొదటిసారి పార్లమెంటులో ఆమె స్పీచ్ వినేందుకు అంతా ఆసక్తి చూపించారు. ఇందుకోసం ప్రియాంక గాంధీ కొంత కసరత్తు కూడా చేశారు. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని,, దేశంలోని వివిధ ప్రాంతాలలో కార్పొరేట్ల కొమ్ము కాస్తుందని పార్లమెంట్ వేదికగా తెలియచెప్పేందుకు ఆమె ప్రయత్నం చేశారు. లోక్ సభ స్పీకర్ ను అడిగి టైం తీసుకుని సబ్జెక్టు ప్రిపేర్ అయ్యాక సభకు వచ్చారు. ఇంతవరకు ప్రియాంక గాంధీ హోంవర్క్ బాగానే నడిచింది కానీ పార్లమెంట్లో అడుగు పెట్టాలని మ్యాటర్ రివర్స్ అయ్యింది.
పార్లమెంటు ప్రసంగంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని ఆమె ఉదహరించారు. పనిలో పనిగా హిమాచల్ ప్రదేశ్ లో ఆపిల్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని లోక్ సభ ద్వారా దేశ ప్రజలకు తెలియజేశారు. అక్కడ రైతులని పట్టించుకునే నాధుడే లేడని,, అంతా కార్పొరేట్ కంపెనీల రాజ్యం నడుస్తుందని పెద్ద స్వరంతో ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. ఈ స్పీచ్ వినగానే బిజెపి సభ్యులతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా షాక్ అయ్యారు.
ఇక్కడే ప్రియాంక గాంధీ బోల్తా కొట్టారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వమే నడుస్తోంది. సొంత రాష్ట్ర ప్రభుత్వం మీద పనిలో పనిగా ప్రియాంక గాంధీ విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నేతలు తల పట్టుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల పాటు హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు.. బిజెపి ఇవే డైలాగుల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ నోరు స్లిప్ అయ్యి కాంగ్రెస్ కు ఇబ్బందులు తెస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే బాటలో నడుస్తుండడంతో హస్తం పార్టీ నేతలకు సమస్యలు ఏర్పడుతున్నాయి.
దీనిమీద కాంగ్రెస్ నాయకులు నోరు విప్పలేని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒక చుక్కాని అవుతుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ మొత్తంగా కాంగ్రెస్ అభిమానుల ఆశల్ని ఆవిరి చేశారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి తోడుగా ప్రియాంక కూడా నిలుస్తున్నారు అని ప్రచారం ఏర్పడింది.