బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ విడుదలకు ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.పృథ్వీరాజ్ చౌహాన్ వీరోచిత కథ చరిత్ర పాఠ్యపుస్తకాలలో పెద్దగా లేదని, కేవలం 2-3 లైన్లు మాత్రమే ఉన్నాయని అన్నారు.
సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మరింత తెలుసుకోవాలనుకున్నానని దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది నుంచి మాత్రమే చాలా కథలు విన్నానని చెప్పారు. దురదృష్టవశాత్తు మన చరిత్ర పుస్తకాలలో ఆయన గురించి 2 లేదా 3 లైన్లు మాత్రమే ఉన్నాయి. కానీ అదే చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఆక్రమణదారుల గురించి చాలా వివరాలు ఉన్నాయి. కానీ మన సంస్కృతి, మహారాజుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని అక్షయ్ కుమార్ అన్నారు.
https://twitter.com/ANI/status/1531886671163437056?s=20&t=ruDDVvUg4hXplC3iFYcpLQ
స్వదేశీ రాజుల చరిత్రలు పుస్తకాలలో ఎందుకు లేకపోవడం దారుణమన్న అక్షయ్… మన చరిత్ర పుస్తకాలలో వారి గురించి రాయడానికి ఎవరూ లేరు. ఈ విషయాన్ని పరిశీలించి, మనం సమస్యను బ్యాలెన్స్ చేయగలమో లేదో చూడాలని విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాననీ అన్నారు. మొఘలుల గురించి మనం తెలుసుకోవాలి, కానీ మన రాజుల గురించి కూడా తెలుసుకోవాలికదా అని అక్షయ్ అన్నారు.
https://twitter.com/ANI/status/1531890521895219200?s=20&t=u6X5SxNxmxI896NPg3sTcQ
ఇది హిందూ జాతీయవాదం గురించి మాత్రమే కాదు, సాంస్కృతిక జాతీయవాదం గురించి కూడా అని దర్శకుడు అన్నారు. హిందూ లేదా సాంస్కృతిక జాతీయవాదాన్ని పునరుద్ధరించడంలో తప్పు లేదనీ బదులిచ్చారు.
“మీరు హిందూ జాతీయవాదం అనే పదాన్ని ఉపయోగించారు. నేను దానిని సాంస్కృతిక జాతీయవాదం అని కూడా అంటాను. హిందూ జాతీయవాదం/సాంస్కృతిక జాతీయవాదాన్ని పునరుజ్జీవింపజేయడంలో తప్పు లేదు. ఈ దేశ లక్షణం హిందువు.. నేను హిందువు అని చెప్పినప్పుడు, దాని అర్థం సంస్కృతి”అని ద్వివేది అన్నారు.
సినిమా తారాగణం ఇటీవల వారణాసికి ఎందుకు వెళ్లారనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. “సినిమా సాంస్కృతిక జాతీయవాదానికి సంబంధించినది కాబట్టి… ఈ దేశానికి ఆధ్యాత్మిక రాజధాని వారణాసి అని మనకు తెలుసు… కాబట్టి కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొదట ధ్వంసం చేసిన ఆక్రమణదారు, ముహమ్మద్ ఘోరీ బానిస కుతుబ్-ఉద్-దిన్ ఐబాక్ అని మన పౌరులకు గుర్తు చేయాలని నా మనస్సులో ఉంది. అతడి క్యారెక్టర్ మా సినిమాలో ఉంది” అని అన్నాడు.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోమనాథ్ పునర్నిర్మాణం, దేశం కోల్పోయిన సంస్కృతిని ఎలా పునరుద్ధరిస్తుందో హైలైట్ చేస్తూ, ద్వివేది తన సినిమాలో చిత్రీకరించిన సోమనాథ్ ఆలయ ప్రస్తావనను కూడా వివరించారు.
https://twitter.com/ANI/status/1531891978559844353?s=20&t=rjN4yONLJHzPtfPfoPfpEw