కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులకు 100 జతల జూట్ పాదరక్షలు అందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులకు చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన ఈ పని చేశారు. కొద్ది రోజల క్రితమే వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ను మోదీ ప్రారంభించారు. ఆ సందర్భంగా రోజంతా ఆయన అక్కడే గడిపారు. విశ్వనాథాలయ ప్రాంగణంలో తోలు లేదా రబ్బరు చెప్పులు ధరించడం నిషేధం. కార్మికులే కాదు… సెక్యూరిటీ గార్డులు, ఇతర పనుల్లో ఉన్నవాళ్లు, చివరకు పూజారులు కూడా ఆ నిబంధనను పాటించాల్సిందే. అయితే అక్కడున్న వాతావరణ పరిస్థితుల్లో… చెప్పులు ధరించాల్సిందే. అక్కడ పనిచేసే పారిశుద్య కార్మికులు సహా ఇతర కార్మికుల్లో కొందరికి పాదరక్షలు లేవని ఆయన గ్రహించారు. దీంతో అందరికీ జూట్ చెప్పులు పంపించారు. విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా కార్మికులపై పూలవర్షం కురిపించిన ప్రధాని వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు వారణాసి పారిశుద్య కార్మికుల కాళ్లు కడిగారు.