ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి.. టీకా తీసుకున్నారు. మొదటి డోసును మార్చి 1వ తేదీన వేయించుకోగా.. 37 రోజుల తర్వాత రెండో డోసును టీకాను వేయించుకున్నారు. భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్‌ను ప్రధాని మోదీ వేయించుకున్నారు.ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. కరోనా మహమ్మారిని జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హులైన అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వ్యాక్సిన్ కోసం cowin.gov.inలో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీకి టీకా వేసిన నర్సులు స్పందించారు. ప్రధాని మోదీని కలవడం, ఆయనకు టీకా వేయడం అనేది తమ జీవితంలో మరిచిపోలేని సంఘటన అని చెప్పుకొచ్చారు. సిస్టర్ నిషా శర్మ, సిస్టర్ పీ నివేద మోదీకి రెండో డోసు వేశారు. ఇక తొలి డోసుఇచ్చిన సిస్టర్ నివేద.. రెండో డోసు వేసిన సమయంలో కూడా సహాయపడిన ఆమె.. సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రధాని మోదీకి తొలి డోసు ఇచ్చినప్పుడు వ్యాక్సినేటర్‌ను తానేనని.. ఈ రోజు మళ్లీ ఆయనకు రెండో డోసు ఇచ్చేందుకు తనకు అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తమతో మాట్లాడారని.. ఆయనతో కలిసి సెల్ఫీలు కూడా దిగామని తెలిపారు.
https://twitter.com/ANI/status/1379975344443125760