
PM inaugurates the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.
హర్యానాలో ఫరీదాబాద్ లో మాతా అమృతానందమయి ఆధ్వర్యంలో నిర్మించిన అత్యాధునిక అమృత ఆస్పత్రికి ప్రధానిమోదీ ప్రారంభించారు. దేశం అమృతోత్సవాలు చేసుకుంటున్న వేళ… సమిష్టి ఆకాంక్షలు, తీర్మానాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశానికి శ్రీ మాతా అమృతానందమయి వైద్యశాలను అందిస్తున్నారని మోదీ అన్నారు. ఆధునికత, ఆధ్యాత్మికత యొక్క సమ్మేళనంగా ఆస్పత్రి ఉందని…పేదలకు అందుబాటులో తక్కువ ధరలో చికిత్స అందించే ఉద్దేశంతో దాన్ని స్థాపించారు. ఈసందర్భంగా అమ్మ ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందన్న ప్రధాని… “ప్రేమ, కరుణ, సేవ , త్యాగాల స్వరూపం అమ్మ అని… భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయానికి అమృతానందమయి వారధి, వాహకురాలు” అని అన్నారు.

PM lighting the lamp at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.
పూజ్య అమ్మ వంటి సాధువుల రూపంలో ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పుడూ దేశం నలుమూలలా వ్యాపించి ఉండటం దేశం యొక్క అదృష్టమని మోదీ కొనియాడారు. మన మత ,సామాజిక సంస్థలు …విద్య-వైద్యానికి సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించే ఈ వ్యవస్థ ఒక విధంగా పాత కాలపు PPP నమూనా అని ప్రధాన మంత్రి అన్నారు. “దీనిని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అంటారు, కానీ నేను దానిని ‘పరస్పర ప్రయాస్’ (పరస్పర ప్రయత్నం)గా కూడా చూస్తున్నాను” అనివ్యాఖ్యానించారు.
అమృత ఆస్పత్రి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అని చెప్పవచ్చు. 2600 పడకలతో దీన్ని నిర్మించారు. వాటిలో 534 ఐసీయూ. ఇందులో 81 స్పెషాలిటీ విభాగాలున్నాయి.సెంట్రలైజ్డ్ ఆటోమేటెడ్ లేబొరేటరీతో సహా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నాయర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు మోదీ. శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ), హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://twitter.com/amritafbd/status/1562151666967007232?s=20&t=XQmP9Y8FouKcoXg7JipS0g
More Photos :

PM lighting the lamp at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.

PM at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.

PM at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.

PM at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.

PM addressing at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.

PM at the inauguration of the state-of-the-art Amrita Hospital, in Faridabad on August 24, 2022.