రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపటి నుంచి అసోం, మిజోరాంలో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. అస్సాంలోని తముల్పూర్లో మే 4వ తేదీన జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గౌహతిలో జరిగే ఈశాన్య ఉత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొననున్నారు. మే 5వ తేదీన ఐజ్వాల్‌లోని మిజోరాం యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)