భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఆయన జీవితం నుంచి ఎన్నో విషయాలను మనం నేర్చుకోవాల్సి ఉందని.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సమసమాజాన్ని నిర్మించడానికి ఆయన జీవితకాలం కష్టపడ్డారన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శాలను ప్రజలు తమ జీవితాల్లో ఇముడ్చుకోవాలని.. ఆయన స్పూర్తితో శక్తివంతమైన దేశ నిర్మాణానికి ప్రజలు తోడ్పడాలని రామ్నాథ్ కోవింద్ అన్నారు.
भारतीय संविधान के प्रमुख शिल्पी, बाबासाहब डॉ.भीमराव अंबेडकर की जयंती पर उन्हें श्रद्धांजलि! डॉ.अंबेडकर ने समतामूलक न्यायपूर्ण समाज बनाने के लिए आजीवन संघर्ष किया। आज हम उनके जीवन तथा विचारों से शिक्षा ग्रहण करके उनके आदर्शों को अपने आचरण में ढालने का संकल्प लें: राष्ट्रपति pic.twitter.com/erOWCrVPzt
— ANI_HindiNews (@AHindinews) April 14, 2021