కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి కోవింద్.
Delhi: President Ram Nath Kovind receives first dose of COVID19 vaccine at RR Hospital pic.twitter.com/5dnJxBRQ9a
— ANI (@ANI) March 3, 2021
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా, ఇప్పటికే ప్రధాని మోదీతో సహా.. పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. మార్చి1వ తేదీ నుంచి మొదలైన రెండో విడత డ్రైవ్లో.. 60 ఏళ్లు దాటిన వారికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. వీరితో పాటుగా 45 ఏళ్లు దాటి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లొ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే టీకాలు తీసుకోవాలనుకునేవారు.. తొలుత కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.