మొన్న శ్రీశైల మల్లన్నను సేవించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లిన ఆమె..అక్కడినుంచి హెలికాఫ్టర్లో భద్రాచలం వెళ్లారు. గవర్నర్ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ సహా పలువురు అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు ఇచ్చారు.