మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు.ఇక గవర్నర్ గా ఉండలేను, దిగిపోతానని గత నెలలోనే ఆయన మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోశ్యారీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్గా ఆయన బాధ్యత చేపట్టిననాటినుంచి వివాదాలకు కేంద్రంగా మారారు. శివాజీ ముందటి తరాలకు మాత్రమే ఆదర్శం, నేటివారికి కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి.




