కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైంది. జనవరి 26న ప్రధానిమోదీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.జనవరి 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేస్తారు. భవన ప్రారంభం తరువాత కూడా పాత పార్లమెంట్లోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారని తెలిసింది. లోక్ సభ మాత్రమే పూర్తిస్థాయిలో సిద్ధం కాగా…రాజ్యసభతో పాటు ఇతర విభాగాల పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలో 13 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా నూతన భవనం నాలుగురెట్లు పెద్దది. 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధాని మోదీ పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.
                                                                    



