ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిని సైఫ్ అనే సీనియర్ వేధించిన మాట నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ప్రీతి ఎదురుతిరగడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని ఆయన వెల్లడించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడని, కానీ మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందని వివరించారు. వాట్సప్ గ్రూప్ లో ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడన్నాడు. గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందన్నారు.కాలేజీ యాజమాన్యానికి, తన తండ్రికి ఈ విషయమై ప్రీతి ఫిర్యాదు చేసిందని..ఇద్జర్నీ యాజమాన్యం విచారించిందనీ అన్నారు. అయినా సైఫ్ తీరు మార్చుకోకపోవడంతో మంగళవారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని వెల్లడించారు. వాట్సప్ మెసేజులు ఆధారంగా సైఫ్ ను అరెస్ట్ చేశామని… ఎలాంటి రాజకీయ జోక్యం, నాయకుల ప్రమేయం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.