ప్రయాగరాజ్ లో హింసాకాండకు సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని ఆదివారం యూపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే కూల్చివేత సమయంలో పోలీసులు ఆ ఇంట్లో పెద్దఎత్తున నిల్వ ఉంచిన అక్రమ ఆయుధాలను కనుగొన్నారు. ఇంట్లో నుంచి రెండు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆయుధాలలో ఒక 12 బోర్ పిస్టల్ సహా 315 బోర్ పిస్టల్ ఉన్నాయి. ఇది కాకుండా నిందితుడు తన ఇంట్లో అనేక కాట్రిడ్జ్‌లను కూడా దాచాడు. అతని ఇంటి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు పలు అభ్యంతరకర పత్రాలు, పోస్టర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు.
BREAKING | जावेद 'पंप' के घर से अवैध हथियार बरामद@Sheerin_sherryhttps://t.co/p8nVQWGCTx#Violence #NupurSharma #UttarPradesh #Prayagraj pic.twitter.com/JJ0L7XHXue
— ABP News (@ABPNews) June 12, 2022
ప్రయాగ్‌రాజ్‌లోని కరేలీలోని జెకె అషియానా కాలనీలో జావేద్ అహ్మద్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఆ అక్రమ నిర్మాణాన్ని ఆదివారం కూల్చివేసారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కూల్చివేత సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.కూల్చివేతకు సంబంధించి అధికారులు శనివారమే అతనికి నోటీసులు పంపారు.
రెండురోజుల క్రితం శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన రాళ్ల దాడికి ప్రధాన సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ సహా 68 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులను విచారిస్తున్నారు. జావేద్ అహ్మద్ విచారణ ఆధారంగా ఇతర నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్, కరేలీ పోలీస్ స్టేషన్లో 70 మంది నిందితులు సహా 5,000 మందికి పైగా గుర్తుతెలియని దుండగులపై 29 కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లో పిల్లలను ఉసికొల్పి హింసకు ప్రేరేపించిన వాడు జావేద్.ఈ విషయాన్ని ఎస్ఎస్పీ అజయ్ కుమార్ ధృవీకరించారు. జావేద్ కుమార్తె సారా అహ్మద్ కు కూడా ఈ అల్లర్లలో హస్తం ఉందని పోలీసులు ప్రాథమికంగానిర్థారించారు. సారా ఢిల్లీలోని జెన్యూలో చదువుతోంది. ఢిల్లీ పోలీసులను సంప్రదించి తమ బృందాలను పంపుతామని యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.