పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ లీడర్ గా ప్రజల ముందుకు రాబోతున్నారు. తెరవెనక వ్యూహకర్తగా ఉన్న ఆయన… ఇక తెరముందుకు రాబోతున్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజలే రియల్ మాస్టర్స్ అని అర్థం వచ్చే విధంగా…ప్రజల ముందుకు వెళ్లే సమయం వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఇన్నేళ్లు ప్రజల కోసం విధానాలు రూపొందించానని…ఇకనుంచి జన్ సురాజ్ దిశగా అడుగు వేయనున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాదు సొంత రాష్ట్రం బిహార్ నుంచే రాజకీయాలు మొదలుపెట్టబోతున్నట్టు ఆయన తెలిపారు.
“ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన, ప్రజా పక్షపాత విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం ద్వారా 10 సంవత్సరాల రోలర్ కోస్టర్ రైడ్‌కు దారితీసింది! రియల్ మాస్టర్స్, ప్రజల వద్దకు వెళ్లే సమయం వచ్చింది. సమస్యలను బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే జన్ సూరజ్ (పీపుల్స్ గుడ్ గవర్నెన్స్)కి మార్గం బీహార్ నుంచి ప్రారంభమవుతుంది” అని పీకే ట్వీట్ చేశారు.
My quest to be a meaningful participant in democracy & help shape pro-people policy led to a 10yr rollercoaster ride!
As I turn the page, time to go to the Real Masters, THE PEOPLE,to better understand the issues & the path to “जन सुराज”-Peoples Good Governance
शुरुआत #बिहार से
— Prashant Kishor (@PrashantKishor) May 2, 2022