సినీ హీరో ప్రభాస్ పెళ్లి మీద వచ్చిన అన్ని రూమర్లు ,,, మరో హీరోకి వచ్చి ఉండవు. ఎందుకంటే తెలుగునాట టాప్ హీరోగా కొంతకాలం క్రేజ్ నడిపిస్తున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ప్రభాస్ .. నిజంగానే రాజ కుటుంబానికి చెందినవాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు రాజకుటుంబ సభ్యుడు. అప్పటి తరం హీరో కృష్ణంరాజుకు తమ్ముడి కొడుకు. అందుచేతనే యువరాజు లాగా అప్పుడప్పుడు తప్ప… ఎక్కువగా మాట్లాడడం ఉండదు. ఇక , బయటకు కనిపించడమే చాలా అరుదు. అందుచేత ప్రభాస్ మీద ఆయన పెళ్లి మీద రూమర్లు పదేపదే గుప్పుమంటాయి. అటువంటిది ప్రభాస్ స్వయంగా ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఫిలింనగర్ అంతా ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయిపోయింది.
చాలాకాలంగా హీరోయిన్ అనుష్క తో ప్రభాస్ కు అనుబంధం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగింది అని చెబుతుంటారు. దీనికి తోడు అనుష్క కూడా పెళ్లికి దూరంగా నిలిచి ఉండడం గమనించాల్సిన విషయం. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా ప్రభాస్ కి పెళ్లి అని టాక్ వచ్చినప్పుడల్లా,, పెళ్లికూతురు అనుష్క అంటూ మరికొంతమంది కథలు అల్లేస్తుంటారు.
నిజానికి ప్రభాస్ ఇటు నిజ జీవితంలో, అటు సినిమాల్లో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఒక్కో సినిమా మీద పూర్తిస్థాయిలో ఎనర్జీ పెడతారు. అందుచేతనే చేసినవి తక్కువ సినిమాలు అయినా.. ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ కూడా అయిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వయంగా కలిసి వచ్చారు . ప్రస్తుతం కల్కి సినిమా పనుల్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. జూన్ నెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అని చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కూడా మొదలు కాబోతోంది . ఈ సమయంలో ప్రభాస్ ఒక స్టోరీ వదిలారు.
“డార్లింగ్స్, ఫైనల్లీ జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి”” అని ఇన్స్టాలో రాసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇది కచ్చితంగా పెళ్లి గురించి అని, త్వరలోనే పెళ్లికూతురు వివరాలు చెబుతారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో వాదన ప్రకారం.. ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, అటువంటి అప్పుడు పెళ్లి అనేది సాధ్యం కాకపోవచ్చు. ఇది కొత్త సినిమా ప్రమోషన్ కి సంబంధించిన అంశం అని అంచనా వేస్తున్నారు.