కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి అద్భుతమైన గుర్తింపు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు చిరపరిచితం. అద్భుతమైన వాగ్ధాటితో, పార్లమెంటుతో కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టే లీడర్ గా పాపులర్. కేంద్ర మంత్రిగా ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారు. అంతకు మించి,,, ఆమె అచ్చమైన తెలుగింటి కోడలు. పుట్టింది తమిళనాడులో అయినా, పరకాల ప్రభాకర్ ను ప్రేమ వివాహం చేసుకొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని సాంప్రదాయిక పరకాల వారి కుటుంబంలో అడుగు పెట్టారు. క్రమం తప్పకుండా నరసాపురం ను ఆమె సందర్శిస్తూ ఉండేవారు. వేసవి కాలంలో తోటి మహిళలతో కలిసి ఆవకాయ పెట్టడం, పిండివంటలు పంచటం అంతా గుర్తు చేసుకొంటారు. కొంత కాలం పాటు హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఆమె స్కూల్ ను కూడా నిర్వహించారు.
…….
తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి బీజేపీ లో స్పోక్స్ పర్సన్ గా చక్కటి గుర్తింపు తెచ్చుకొన్నారు. హిందీ, ఇంగ్లీషు భాషల మీద అద్భుతమైన పట్టు ఉండటంతో బాగా రాణించారు. 2014 నుంచి పదేళ్లుగా కేంద్ర మంత్రిగా పవర్ ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకొన్నారు. ఈ ప్రతిభా పాటవాలను అంతర్జాతీయ వార్తా సంస్థ.. ఫోర్బ్ మ్యాగజైన్ గుర్తించారు. ప్రపంచంలోనే పవర్ ఫుల్ మహిళల జాబితాలో ఆమె పేరు నమోదు చేశారు. వరుసగా ఆరో సంవత్సరం నిర్మల పేరుని అందులో నమోదు చేశారు.
…….
అంతర్జాతీయ వార్తా సంస్థ.. ఫోర్బ్స్ మ్యాగజైన్.. ప్రతీ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయ, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేడీ బాస్ లకు అవకాశం ఇచ్చారు. అత్యధిక శాతం మంది అమెరికా, ఐరోపా దేశాలవాళ్లే ఉండటం విశేషం.
…
అంతటి పోటీ తీవ్రంగా ఉండే జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం లబించింది. ఇక,, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలోనిలిచారు. ఇప్పుడు 28వ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రతీ ఏటా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. అంతే కాదు, నిర్మలా సీతారామన్ గురించి ఈ మ్యాగజైన్ అనేక ప్రశంసలు కురిపించటం కూడా విశేషం.
….
ఇదే జాబితాలో నిర్మలమ్మ తర్వాత మరో ఇద్దరు భారతీయ మహిళలకు స్థానం దక్కింది. ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో అయిన ..రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ …. కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో ఉన్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు మహిళలు కూడా పారిశ్రామిక వేత్తలుగా అద్భుతంగా రాణిస్తున్నారు.
….
కేంద్ర మంత్రి గా ఉన్నప్పటికీ, ఎక్కడా వివాదాలకు దూరంగా నిలవటం నిర్మలా సీతారామన్ గొప్పతనం. హైందవ సాంప్రదాయాలు, సంస్క్రతిని ఆమె ఎప్పుడూ గౌరవిస్తారు. అంతర్జాతీయ వేదికల మీద కూడా చక్కటి చీరకట్టుతో ఆమె నిలుస్తుంటారు. అందుకే తెలుగింటి కోడలు గానే నిర్మల ను చూడవచ్చు.