తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగపాఠాన్ని ఉన్నదున్నట్టు చదవకపోవడం, ముఖ్యంగా ద్రవిడ ప్రముఖుల పేర్లు ఉన్న పేరాలను స్కిప్ చేయడంపై పాలకపార్టీ మండిపడింది. రవికి వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా పెద్దఎత్తున పోస్టర్లు వెలిశాయి. గెట్ అవుట్ రవి అని హ్యాష్ టాగ్ తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. పోస్టర్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ , యువజన సంక్షేమ, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫొటోలున్నాయి. గెట్ అవుట్ రవి అనే హాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన వారికి డీఎంకే నేతలకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.