తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు నిర్వహించారు.
గుర్తుతెలియని వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు చేసినట్టు తెలుస్తోంది.
ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే యూనిట్ ఆఫీస్ లోకి పోలీసులు చొరబడ్డారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
లోకల్ పోలీసులతో పాటు మూడు ప్రత్యేక వాహనాల్లో పోలీసులు క్యూ న్యూస్ ఆఫీసుకు చేరినట్టు తెలుస్తోంది. అయితే సోదాలకు కారణం పోలీసులింకా చెప్పలేదు.