గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలను కలిశాను. అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై మేం విస్తృత చర్చలు జరిపాం. తెలంగాణలో వంశపారంపర్య దుష్టపాలనను అంతం చేసి.. సుపరిపాలన కొరకై బీజేపీ కృషి చేస్తుంది’’ అని వారితో సమావేశం అనంతరం ట్వీట్ చేశారు మోదీ. మోదీ ఆహ్వానం మేరకే గ్రేటర్ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు ఢిల్లీవెళ్లారు.
వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధానితో వీరి సమావేశం చర్చనీయాంశమైంది.