ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రహదారుల నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY-4) కింద రాష్ట్రానికి 608 రహదారులను మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో పనులు చేపట్టేందుకు కేంద్ర అనుమతించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఏపీకి మంజూరైన రోడ్లను మైదాన ప్రాంతాల్లో 500కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో, 200మందికి పైగా ఉన్న గిరిజన కొండప్రాంతాల్లో, 100కు పైగా జనాభా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వేయనున్నారు.
పీఎం ఆవాస్ గ్రామీణ్ పథకం కింద ఏపీలో 83,199 ఇళ్లు నిర్మించామని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. కేంద్రబడ్జెట్ 2025-26పై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడకు వచ్చిన కేంద్రమంత్రి, ప్రజలు, మేధావులతో సమావేశమయ్యారు. కేంద్రప్రభుత్వం, ఏపీకి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1.56 కోట్ల మందికి లబ్ధి జరిగిందని, రాష్ట్రంలో 278 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
మొత్తం మీద మోదీ ప్రభుత్వం చొరవ తో ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయి.