ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు ప్రధాని మోదీ. టోక్యోలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాండించిన మీకు శుభాకాంక్షలు అంటూ మాట్లాడారు. సంబరాల్లో ఉన్న వారి ఆనందాన్ని రెట్టింపు చేశారు. కెప్టెన్ మన్ ప్రీత్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన ప్రధాని.. ప్రశంసల జల్లు కురిపించారు. చాలా అద్భుతంగా ఆడారంటూ ఆటగాళ్లను ప్రశంసించారు. ఈ విజయాన్నియావత్ భారత దేశం పండగలా జరుపుకుంటోందని కొనియాడారు.మీ ఆశీస్సుల్లో మనల్ని గెలిపించాయని మన్ ప్రీత్ ప్రధానితో అన్నారు.