భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో జరుపుతున్న అధికారిక పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి సాదర స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘క్రిసెట్’ ను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం ఉభయ దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని మరోసారి చాటిచెప్పింది. ప్రధాని రాకతో జెరూసలేం వీధులన్నీ భారత్-ఇజ్రాయెల్ మైత్రీ నినాదాలతో హోరెత్తుతున్నాయి.
………………………………………………………………
రాజకీయంగానే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా మోదీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్లు అంటే.. 10 కోట్లు ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ రాజకీయ నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్స్ 43.2 మిలియన్లు కంటే మోదీ రెట్టింపు కంటే ఎక్కువ తో అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా, ఫేస్బుక్ మరియు ‘X’ వేదికలపై కూడా అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా మోదీ తన గ్లోబల్ బ్రాండ్‌ను సుస్థిరం చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా నరేంద్రమోదీ నిలుస్తున్నారు.
……………………………………………………………………
ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రపంచ నేతలందరిలో నరేంద్ర మోదీ అత్యధిక అప్రూవల్ రేటింగ్ (67%) తో అగ్రస్థానంలో నిలిచారు. క్లిష్ట సమయాల్లో భారతదేశం అనుసరిస్తున్న దౌత్య నీతి, ఆర్థిక సంస్కరణలు మరియు ఇతర దేశాలకు అందిస్తున్న సహకారం ఆయన పట్ల అంతర్జాతీయంగా గౌరవాన్ని పెంచాయి. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత మరియు వ్యవసాయ రంగాల్లో ఇజ్రాయెల్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలబెడుతున్నాయి.
…..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య శాంతి దూతగా, అభివృద్ధికి మార్గదర్శకుడిగా మోదీని విదేశీ మీడియా కొనియాడుతోంది. భారతీయ సంస్కృతిని, యోగాను మరియు ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఆయన చూపిన చొరవ నేడు భారత్‌ను ‘విశ్వగురు’ స్థానంలో నిలబెట్టింది. ఇజ్రాయెల్ పర్యటనలో ఆయనకు లభిస్తున్న అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. ప్రవాస భారతీయులతో ఆయన జరిపిన ఆత్మీయ సమావేశం, ఇరు దేశాల మధ్య ఉన్న బంధం కేవలం వ్యూహాత్మకమైనది మాత్రమే కాదు, మనోభావాలతో కూడినదని స్పష్టం చేసింది.



