ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద బెనిఫిట్స్ ను విడుదల చేశారు.
2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులను లేదా పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతుగా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకాన్ని మే 29న ప్రారంభించారు. ఈ పథకం కింద బెనిఫిట్స్ ను ఈరోజు మోదీ విడుదల చేశారు.
ఈవెంట్లో వర్చ్యువల్ గా ప్రసంగించిన ప్రధాని మోదీ, “నేను పిల్లలతో ప్రధానిగా కాకుండా వారి కుటుంబ సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు పిల్లల మధ్య ఉన్నందుకు చాలా రిలీఫ్‌గా ఉన్నాను. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేది ప్రతి దేశస్థుడు మీతో అత్యంత సున్నితత్వంతో ఉన్నారనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన స్కూలుకి వెళ్లే పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతనాలను అందించారు. పిల్లల కోసం PM CARES పాస్‌బుక్ తోపాటు ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య కార్డును కూడా మోదీ పిల్లలకు అందించారు.
https://twitter.com/narendramodi/status/1531140700829454336?s=20&t=tQKrqC9A89yNTJ8MK1JYlg
“కోవిడ్ -19 మహమ్మారి విజృంభించిన సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వ్యక్తుల పరిస్థితి ఎంత కష్టమో నాకు తెలుసు. మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఈ కార్యక్రమం. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అటువంటి పిల్లల కోసం చేసిన ప్రయత్నమే” అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.
“మీ తల్లిదండ్రుల ప్రేమను ఏ ప్రయత్నం, ఏ మద్దతు భర్తీ చేయలేదు. వాళ్లు లేనప్పుడు భరత మాత మీ వెంటే ఉంది. పీఎం కేర్స్ ద్వారా భారత్ దీనిని నెరవేరుస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి, సంస్థ లేదా ప్రభుత్వం చేసే ప్రయత్నం మాత్రమే కాదు. పీఎం కేర్స్‌లో ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చారు” అని మోదీ తెలిపారు.
ఈ పథకం కింద ఎవరికైనా ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ అవసరమైతే, PM-CARES వారికి సహాయం చేయగలదని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ చిన్నారులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు నెలకు రూ.4000 అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1531144095539662848?s=20&t=TBOjCgP4UfScCNngN8SwJg
అలాంటి పిల్లలు పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత వారి భవిష్యత్తు అవసరాలకు మరింత డబ్బు అవసరమవుతుందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ పథకం ద్వారా 18-23 సంవత్సరాల వయస్సు గల యువకులకు ప్రతి నెల స్టైఫండ్‌ను అందజేస్తామని.. వారు 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారికి రూ.10 లక్షలు అందజేస్తామని మోదీ ప్రకటించారు.
పిఎమ్ కేర్స్ ఫర్ చిల్డ్రన్’ ద్వారా పిల్లలకు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ కూడా ఇస్తున్నామని.. ఈ ఉచిత సదుపాయం నుంచి రూ. 5 లక్షల వరకు చికిత్స కూడా అందుబాటులో ఉంటుందని అన్నారు.
“మహమ్మారి సమయంలో ఆసుపత్రులను సిద్ధం చేయడం, వెంటిలేటర్లను కొనుగోలు చేయడం, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో పీఎం కేర్స్ ఫండ్ చాలా సహాయపడింది. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాం. నేడు ఈ నిధిని పిల్లల కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం వినియోగిస్తున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1531142846002081792?s=20&t=h8GcRFK4Na0MBxw3rhQSAg