తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావులలో పింగళి వెంకయ్య ఒకరు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అలనాడు ప్రజల్లో రగిలించేందుకు జాతీయ జెండాను విరివిగా వాడేవారు. అటువంటి జాతీయ జెండాను రూపొందించిన మహనీయుడే పింగళి వెంకయ్య. ఆయన తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణం.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య .. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు.
సరిగ్గా ఇదే రోజున అంటే ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876 లో ఆయన జన్మించారు. ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న పింగళి వెంకయ్య అనేక ప్రయోగాలు చేశారు ఇరిగేషన్ వ్యవసాయం గ్రామీణ ప్రగతి వంటి రంగాలలో పనిచేశారు.
19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.
స్వయానా ఇంజనీరింగ్ నిపుణులు కావటంతో వెంకయ్య..
స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకం మీద దృష్టి పెట్ఝారు. అప్పటికే కొన్ని జెండాలు ఉన్నాయి కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై ‘రాట్నం’ గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచన మేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది.
ఏప్రిల్ 13, 1936 నాటి ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మహాత్ముడు సూచనలతో ఒక జెండాను వెంకయ్య రూపొదించగా.. సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. దీంతో వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.
మరో విషయం కూడా గమనించాలి. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది బెజవాడలోనే. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం.
ఆగస్టు రెండు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకొందాం. స్వాతంత్రం తర్వాత కూడా ఆయన భారతజాతి నిర్మాణం కోసం పని చేశారు