‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిల్ పిటిషన్ ను బాంబే హైకోర్టు మార్చి 8న కొట్టేసింది. ఈనెల 11న సినిమా విడుదల కావల్సి ఉండగా… నిలుపుదల చేయాలంటూ ఇంతేజార్ హుస్సేన్ సయ్యద్ పిటిషన్ వేశారు. పిల్ ను విచారణకు స్వీకరించింది బాంబే హైకోర్టు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం స్టేను తిరస్కరించింది. CBFC సర్టిఫికేట్ మంజూరు చేసిందో లేదో తెలుసుకోవడానికి మీరు RTI వేశారా అని న్యాయమూర్తి దత్తా పిటిషనర్ ను ప్రశ్నించారు. అయితే ఆర్టీఐ నుంచి వివరణ కోసం కనీసం నెలపడుతుందని పిటిషనర్ బదులిచ్చారు. దీంతో సినిమాను ఆపలేమని వ్యాఖ్యానించిన కోర్టు పిటిషన్ ను కొట్టేసింది.
1990లో కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమం ఆధారంగా సినిమాను రూపొందించారు. నేషనల్ ఫిలిం అవార్డుల గ్రహీత వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మార్చి 11న విడుదలకు సిద్ధమైంది. అంతలోనే సినిమాను ఆపాలంటుూ కోర్టుకెళ్లారు ఇంతేజార్ హుస్సేన్ సయ్యద్. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ట్రైలర్ ముస్లిం సమాజం యొక్క మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ సినిమా ట్రైలర్‌ను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వివేక్ అగ్నిహోత్రి ఆరోపణలను కొట్టిపారేశారు, తన చిత్రం కేవలం వాస్తవాలను మాత్రమే చూపుతుందని స్పష్టం చేశారు. కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని చిత్రీకరించాలని తాను నిర్ణయించుకున్నానని ముందునుంచీ చెబుతూ వచ్చారు. తన సినిమాలోని ప్రతీ ఫ్రేమ్, ప్రతీ పదం వాస్తవమని కోర్టులోనే కాదు ఏ వేదిక మీదైనా నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. కశ్మీర్ ఫైల్స్ మూవీ ట్రైలర్ ను పది రోజుల్లోనే యూట్యూబ్‌లో 9.5 మిలియన్ల మంది చూశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)