బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు 113 మంది మద్దతు పలికారు. దీంతో బ్రిటీష్ ప్రధానమంత్రి పదవికి రిషి అత్యంత చేరువలో ఉన్నారు. దీంతో అక్కడివాళ్లతో భారతీయుల ఆనందం అంతా ఇంతా కాదు… గతంలో రిషి తన ఇంటి ముందు దీపాలను వెలిగిస్తూ ఉన్న ఫోటో, వీడియో వైరల్ గా మారింది.హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించే.. భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని కాబోతున్నారని హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక కొన్నిరోజుల క్రితం మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేసిన మీమ్ కూడా ఆకట్టుకుంది. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఆ మీమ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఆ ఫొటోలో బ్రిటన్ ప్రధాని నివాసం పూర్తి హిందూ సంప్రదాయబద్దంగా అలంకరించి ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు, స్వస్తిక్ చిహ్నాలున్నాయి. ఆధ్యాత్మికతకు, దైవత్వానికి ప్రతీకగా అక్కడి వాతావరణ ఉంది.
https://twitter.com/anandmahindra/status/1546878479970766848?s=20&t=JD8gBaE1rraxtyaJj7KgQA