పెట్రోల్ డీజిల్ ధరలు/టాక్స్ లు తగ్గించలేరు.
కారణం?
ఉచితాలు. కేంద్రానికి అయినా రాష్ట్రాలకు అయినా ఆదాయం వచ్చేది టాక్స్ లు ద్వారా మాత్రమే. ‘ఉచితాలు ఊరికే రావు’ . ప్రజలకు ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు అంటే అదే ప్రజల దగ్గర నుండి వేరే రూపంలో టాక్స్ లు వసూలు చేసుకోవలసిందే.
లేదా టాక్స్ లు పెంచితే ప్రజల ఆగ్రహానికి భయపడే ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా వేలకోట్లలో అప్పులు చేసి వాటి మీద వడ్డీలు మన దగ్గర వసూలు చేసిన టాక్స్ ల లోంచి చెల్లించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఇంకా ఆదాయాలు తగ్గిపోతాయి కాబట్టి మళ్లీ కొత్త అప్పులు చేయడం, వాటి మీద వడ్డీలు కట్టడం. చివరికి ఒక స్టేజి ఎలా వస్తుంది అంటే పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మాత్రమే కొత్త అప్పులు చేసుకోవలసిన పరిస్థితి వస్తుంది. అన్ని ఉచితాలు ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న వెనిజులా ఇప్పుడు తన ప్రజలను దాదాపు ముష్టివాళ్ల లాగా మార్చేసింది.
మన దేశంలో 2017 లో GST పెట్టాక ఈ నాలుగు సం.లలో ఏ వస్తువుల మీద టాక్స్ రేట్లు పెంచలేదు. ఇంకా చెప్పాలి అంటే మన రోజూ వాడే సుమారు 50 రకాల వస్తువుల మీద టాక్స్ రేట్స్ (అంటే గతంలో సెంట్రల్ EXCISE+VAT +మిగతా టాక్స్ లు అన్ని కలిపి వాటితో GST పోలిస్తే) తగ్గాయి. గతంలో అయితే అన్ని వస్తువుల మీద ఎక్సయిజ్ టాక్స్ లు, ఎంట్రీ టాక్స్ లు, వేట్ టాక్స్ లు పెంచేవారు. ఆ టాక్స్ ల పెంపు ప్రజలకు డైరెక్ట్ గా తెలిసేది కాదు. అందు వల్ల వార్తా మాధ్యమాలు కూడా ఆ టాక్స్ పెంపు పై పెద్దగా వార్తలు ఇచ్చేవి కాదు.
కానీ ఇప్పుడు GST పెట్టాక అలా అదనపు ఆదాయం కోసం కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ అన్ని వస్తువుల మీద టాక్స్ లు పెంచుకోలేవు.
సో ఇక ప్రభుత్వాలకు టాక్స్ లు పెంచుకునే సౌలభ్యం ఉన్నవి రెండే ప్రధాన వస్తువులు. అవి మద్యం మరియు పెట్రోల్ ఉత్పత్తులు. కానీ పెట్రోల్ ధర పెంపు అనగానే ప్రసార మాధ్యమాలు విపరీతమైన వ్యతిరేక ప్రచారం కల్పిస్తాయి.
మరి GST పెరగక పోతే వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అన్నది మరో ప్రశ్న?
దానికి ముఖ్య కారణం –
డిమాండ్-సప్లై. అంటే దేశంలో వినియోగానికి సరిపడే ఉత్పత్తి లేదా సరఫరా లేకపోవడం.
ఉదాహరణకు మనకు బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, పంచదార ఉత్పత్తి/సరఫరా వినియోగానికి సరిపోయినంత ఉంది. అందుకే 7 సం.ల క్రిందటి ధరలతో ఈ వస్తువుల నేటి ధరలు పోలిస్తే కొన్ని 10-25% వరకు మాత్రమే సాధారణంగా పెరిగాయి. గత ఏడు సం.లలో వ్యవసాయ ఉత్పత్తులపై 25% నుండి 100 శాతం వరకు మద్దత్తు ధరలు పెరిగాయి. అంటే అంతమేరా లేదా అంత కంటే ఎక్కువుగా తప్పనిసరిగా రిటైల్ లో ధరలు పెరుగుతాయి.
కానీ వంట నూనెలు ధరలు విపరీతంగా పెరిగాయి..
దేశంలో నూనెగింజల ఉత్పత్తి వినియోగానికి సరిపడినంతగా పెరగడం లేదు. గత 7 సం.లలో మద్దత్తు ధరలు భారీగా అంటే 50% వరకూ పెంచినా ఒక 50% వరకు మాత్రమే ఉత్పత్తి పెరిగింది. అయినా వినియోగం బాగా పెరగడంతో దిగుమతులు పెంచారు. కోవిడ్ కారణంగా విదేశాల్లో పామాయిల్ దిగుబడులు బాగా తగ్గాయి. అంతే కాక రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తం కావడం వల్ల కూడా దిగుమతులు అనుకున్నంత మేరా సకాలంలో రాలేదు. అందువల్లే దేశంలో వంట నూనెలు ధరలు సుమారు 70% పైగా పెరిగాయి.
అలాగే 15 నెలలుగా కరోనా వల్ల దేశం లో వ్యాపార కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో జరగక బడ్జెట్ లో అనుకున్న టాక్స్ వసూళ్లు రావడం లేదు. అంతేకాక కరోనా వల్ల ప్రభుత్వ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది.
ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ సప్లై, వెంటిలేటర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ దిగుమతులు ఇలా చాలా ఖర్చ్ పెరిగింది.
అలాగే కరోనా వల్ల ఇబ్బంది పడకూడదని 80 కోట్ల మందికి 15 నెలలు ప్రతీ కుటుంబ సభ్యుడికి 5 కిలోలు చొప్పున రేషన్ ఫ్రీ గా ఇవ్వడానికి, హెల్త్ వర్కర్స్ కి 50 లక్షల ఉచిత భీమా ప్రీమియం, బీద వారికి 3 గాస్ సిలిండర్లు ఉచితం, ఇలా అన్ని కలిపి గత మార్చిలో ప్రకటించినవే ₹1,70,000కోట్లు మళ్లీ మొన్న కోవిడ్ వచ్చినపుడు పైనవి కొన్ని మళ్ళీ ప్రకటించారు.
ఉచిత వాక్సిన్ ఖర్చు 50 వేలు కోట్లు పై మాటే.
అలాగే సుమారు 15 నెలల నుండి యుద్ధం రాకుండా చైనా బోర్డర్ వద్ద 50 వేల మంది సైనికులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు మోహరించి ఉంచారు . రోజుకు సుమారు 100-150 కోట్లు ఖర్చు అవుతోంది అని అంచనా..
ఇలా ఎటు చూసినా భయంకరమైన ఖర్చు కనిపిస్తోంది కానీ ఆదాయాలు పెరిగే మార్గం కనిపించడం లేదు. ఇక్కడ ఖర్చుకు కక్కుర్తి పడి బోర్డర్ వద్ద సెక్యూరిటీ తగ్గించి ఒక వేళ యుద్ధం గనక వస్తే మన పెట్రోల్ డీజిల్ వినియోగం పై ఆంక్షలు పెట్టి వాటి సప్లై మిలీటరీకి తరలిస్తారు. అప్పుడు పెట్రోల్ డీజిల్ బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి వస్తుంది.
గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి పెంచమని భారత్ కోరుతోంది. అలా అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గి ఇక్కడా తగ్గుతాయి. దానికి ఓపెక్ ఒప్పుకుంది అని ఈ రోజు వార్త. అలా అయితే ఆగస్టు నుండి ధరలు తగ్గే అవకాశం ఉంది.
క్రింద ఇచ్చిన వాటిలో అప్పటి మద్దత్తు ధరలు- అప్పటి రిటైల్ ధరలు, ఇప్పటి మద్దత్తు ధరలు ఇప్పటి రిటైల్ ధరలు బేరీజు వేసి చూడండి.
…చాడా శాస్త్రి..