పోలీస్ శాఖలో ట్రాన్స్ జెండర్లను తీసుకునేలా.. రిజర్వేషన్ కు అనుమతిచ్చింది కర్ణాటక ప్రభుత్వం.
ఇకనుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగే నియామకాలలో ట్రాన్స్ జెండర్ లకు 1 శాతం రిజర్వేషన్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఇస్తూ వచ్చామని.. మా లక్ష్యం డిపార్ట్మెంట్ లో 25 శాతం మహిళలను చేర్చుకోవడమేనని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పుడు
సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లకూ అవకాశం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.