కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతురు అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆడక పోవడంతో దిక్కుతోచని పరిస్థితికి లోనయ్యారు. సినిమాల్లో వేషాలు రాక తిరిగి ఇంటికి వెళ్ళలేక సతమత మయ్యారు. ఆ సమయంలో చనిపోదామనే ఆలోచనలో కూడా పడ్డారు. ఒక సారి వారి రూమ్ లో ఒక గ్లాస్ లో టీ పోసి ఉంటే దాన్ని తాగేశారు. ఆయన తాగిన తరువాత ఆ టీ అక్కడ పెట్టిన వారు ఎవరు తాగారు ఆ టీ అని అడిగితే నేనే తాగాను అని సత్యనారాయణ చెప్పారుట. అయ్యో ఆ టీలో బల్లి పడి ఉంటే పక్కన పెట్టాము అంటే అంతే కదా పోతే పోతాను అని అనుకున్నారుట. ఆ టీ ఎలాంటి కీడు తలపెట్ట లేక పోయింది అని ఒక సందర్భంలో సత్యనారాయణ చెప్పారు. సత్యానారయణ యన్.టి. రామారావు లాగా ఉండటం వల్ల అతనికి సినిమాల్లో అవకాశం వచ్చింది. సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో యన్ టి రామారావుకు డూప్ గా నటిస్తావా అని అడిగితే సరే ఏదో ఒక అవకాశం వచ్చింది చాలు లే అని చేయడానికి ఒప్పుకున్నారు. అలా యన్.టి.ఆర్ కు డూప్ గా నటిస్తున్న సమయంలో యన్.టి.రామారావు ద్రుష్టిలో పడ్డారు. రాముడు భీముడు సినిమాలో యన్.టి. ఆర్ కు డూప్ గా చేసినా కూడా చివర్లో యన్.టి.ఆర్ బదులు నేరుగా సత్యానారాయణే కనిపిస్తారు. సత్యానారాయణ కు యన్.టి.ఆర్ సినిమాల్లో అవకాశం రావడానికి మరో కారణం ఉంది. అప్పట్లో హీరోలకంటే విలన్లకే ఎక్కువ డిమాండ్ ఉండేది.విలన్ల డేట్ లు దొరికిన తరువాత నే హీరోల డేట్లు తీసుకునే వారు. దాంతో సత్యానారాయణకు కూడా అలాంటి పరిస్తితే వచ్చింది. దానికి కారణం యన్.టి. ఆర్ తనకు ప్రత్యర్థిగా నటించేవాడు తన కంటే ధ్రుడంగా ఉండాలని అనుకోవడమే .. యన్.టి.ఆర్ , సత్యనారాయణ కాంబినేషన్ లో నూటా ఒక్క సినిమాలు వచ్చాయి అంటే దానికి కారణం ఇదే, యన్.టి. ఆర్ తో సత్యానారాయణ శ్రీనాధ కవి సార్వభౌముడు అనే చిత్రంలో చివరి సారి కలిసి నటించారు. కైకాల సత్యనారాయణ వివిధ పాత్రల్లో దాదాపు నాలుగు తరాల హీరోలతో నటించారు. నిర్మాతగా మారి మంచి అభిరుచిగల సినిమాలు తీశారు. యన్.టి. ఆర్ తో గజదొంగ, క్రుష్ణతో మామా అళ్ళుళ్ళ సవాల్,చిరంజీవితో కొదమ సింహం, అక్కినేని నాగేశ్వరరావు తో బంగారు కుటుంబం సినిమాలు తీశారు. నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. రాజకీయాల్లోకి వచ్చిన అందరు సినిమా నటులు మాదిరి, తొలుత విజయాన్ని సాధించి తరువాత పరాజయం పాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సత్యనారాయణ నటుడిగా కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు వారెవరు సినిమా రంగంలో లేరు. సత్యనారాయణ మరణంతో దాదాపు ఆ తరం ప్రసిద్ద నటీ నటులు అందరూ వెళ్ళి పోయినట్టైందని సినిమా పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి.